తెలంగాణ

telangana

ETV Bharat / city

LAND VALUE INCREASE: రిజిస్ట్రేషన్‌ రుసుం పెంపుతో రాష్ట్ర ఖజానాకు భారీ రాబడి - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్‌ రుసుం పెంపుతో మూడు వేల కోట్లకుపైగా మొత్తం అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని స్టాంపులు,రిజిస్ట్రేషన్‌ శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వ నిర్దేశిత విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుం పెంచేందుకు సిద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తోంది. మార్కెట్‌ విలువల కమిటీల ప్రతిపాదనలు తప్పనిసరి అవుతున్నందున సవరించిన విలువలు జులై 20 తరువాతనే అమలులోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు.

LAND VALUE INCREASE
LAND VALUE INCREASE

By

Published : Jul 15, 2021, 5:13 AM IST

Updated : Jul 15, 2021, 9:11 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఆగస్టులో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా అటు మార్కెట్‌ విలువ కాని, ఇటు రిజిస్ట్రేషన్‌ రుసుం కాని పెంచలేదు. ఈ ఎనిమిది సంవత్సరాల్లో భూములు, ఆస్తులు విలువలు అనూహ్యంగా పెరిగాయి. బహిరంగ మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వ నిర్దేశిత విలువలకు ఎక్కడ పొంతన లేదు. దీంతో తాజాగా మార్కెట్‌ విలువలు పెంచేందుకు గత కొన్ని రోజులుగా కసరత్తు చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. సబ్‌ కమిటీ ఇప్పటికే దీనిపై సానుకూలత వ్యక్తం చేయడంతో మంగళవారం రాత్రి జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో కూడా మార్కెట్‌ విలువల పెంపుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మార్గదర్శకాలు కోసం ఎదురుచూపు..

విలువలు పెంపునకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఎప్పటి నుంచి అమలు చేయాలి తదితర అంశాలతో కూడిన మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇందుకోసం స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ల శాఖ ఎదురుచూస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల చట్టం ప్రకారం.. ప్రతి ఏడాది పట్టణ ప్రాంతాలల్లో ప్రతి రెండు సంవత్సరాలకు గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల విలువలను సవరించాల్సి ఉంది. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణాలో ఎలాంటి పెంపు లేకపోవడంతో.. తాజాగా జరిగే పెంపు భారీగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కాని పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని.. మార్కెట్‌ విలువలు పెంచే దిశలో కసరత్తు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు తెలిపారు. అయితే చాలా కాలంగా విలువ పెంచనందున... ఇప్పుడు పెంచే మార్కెట్‌ విలువలు అధికంగానే కనిపించినా... ఇతర రాష్ట్రాల కంటే కూడా తక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యయేతర భూములు, ఆస్తుల విలువలు పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించిన విలువలు.. విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. ఆస్తుల విలువలు పెంపుదల ఈ విధంగా ఉంటాయి.

  • వ్యవసాయేతర భూములు: గజం పదివేలు రూపాయలు లోపు ప్రభుత్వ నిర్దేశిత విలువ కలిగి ఉంటే దానిపై యాభైశాతం, రూ.10వేలు నుంచి రూ.20వేలు మధ్య విలువ కలిగి ఉంటే 40 శాతం, రూ.20 వేలుకు పైగా నిర్దేశిత విలువ ఉంటే.. 30శాతం లెక్కన పెంచేందుకు రంగం సిద్దమైంది.
  • నిర్మాణాలకు సంబంధించి: చదరపు గజం రూ.1700లోపు ప్రభుత్వ నిర్దేశిత విలువ ఉంటే దానిని రూ.1800లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా చదరపు అడుగు రూ.1700 నుంచి రూ.4000 మధ్య ప్రభుత్వ నిర్దేశిత విలువ ఉంటే...20శాతం, రూ.4వేలు కంటే ఎక్కువ విలువ ఉన్నట్లయితే 30శాతం లెక్కన పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వారం పదిరోజులు పట్టొచ్చు..

గతంలో కూడా మార్కెట్‌ విలువలు పెంపు సమయంలో మార్కెట్‌ విలువల పెంపు కమిటీల నుంచి ప్రతిపాదనలు తీసుకోలేదు. ఇదే సాకుపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో తిరిగి ఒక కమిటీల నుంచి ప్రతిపాదనలు తెప్పించి అమలు చేయాల్సి వచ్చిందని ఓ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇందువల్ల నేరుగా అమలు చేసేందుకు అవకాశం లేదని అంచనా వేస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖ తక్కువలో తక్కువ సమయం తీసుకున్నా వారం, పది రోజులైతే అమలు చేసేందుకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

ఇప్పటికిప్పుడు అవకాశం లేదు..

గతంలో కూడా మార్కెట్‌ విలువలు పెంపు సమయంలో మార్కెట్‌ పెంపు కమిటీల నుంచి ప్రతిపాదనలు తీసుకోలేదు. ఇదే కారణంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కమిటీలు ప్రతిపాదనలు తెప్పించి.. అమలు చేయాల్సి వచ్చిందని రిజిస్ట్రేటర్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇందువల్ల నేరుగా అమలు చేసేందుకు అవకాశంలేదని.. అంచనా వేస్తున్న రిజిస్ట్రేటర్ శాఖ తక్కువలో తక్కువ సమయం తీసుకున్నా.. వారం పదిరోజులు అయితే అమలు చేసేందుకు పడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పంచాయతీల వారీగా, పట్టణాల వారీగా, నగరాల వారీగా, విలువల పెంపునకు కమిటీల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉంది. ఇందువల్ల మార్కెట్‌ విలువల పెంపునకు గ్రామీణ, పట్టణ రెండు కమిటీలకు అప్పగిస్తారు. గ్రామీణ కమిటీలకు ఆర్డీవోలు, పట్టణ కమిటీలకు అదనపు కలెక్టర్లు నియంతృత్వం వహిస్తుండగా.. సబ్‌రిజిస్ట్రార్లు ఆయా కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహారిస్తారు. అయితే గ్రామీణ కమిటీలల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో సభ్యులుగా పట్టణ కమిటీల్లో జేడ్పీసీఈవో, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా వ్యవహారిస్తారని రిజిస్ట్రేటర్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కమిటీల వద్ద ఇప్పటికే సమాచారం సమగ్రంగా ఉన్నప్పటికీ.. ప్రతిపాదించేందుకు కనీసం వారం రోజులు పడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనిని భట్టి చూస్తే ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం లేదని భావించొచ్చు.

రూ.మూడు వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం..

రిజిస్ట్రేషన్‌ రుసుం ప్రస్తుతం ఆరు శాతంగా ఉంది. కాని దీన్ని 7 నుంచి 7.5శాతానికి పెంచాలని స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఒక్క శాతం పెరిగితే వెయ్యి కోట్లు అదనంగా వస్తుందని అంచనా వేస్తున్న రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు... 1.5శాతం పెంచినా రూ.1500 కోట్లకు మించదని స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా మార్కెట్‌ విలువలు పెంచడం ద్వారా మరో రూ.1500 నుంచి రూ.2వేల కోట్లు వరకు అదనంగా రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి రూ.మూడు వేల కోట్లకుపైగా మొత్తం అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

బుధవారం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు..

రాష్ట్రంలో ఆస్తులు, భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుంలు పెరుగనున్న తరుణంలో... బుధవారం భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. రోజుకు మూడు నుంచి నాలుగు వేలు మధ్య డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.25 నుంచి 30 కోట్లు మధ్య మాత్రమే ఆదాయం వచ్చేది. కాని రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు విలువ, రిజిస్ట్రేషన్‌ రుసుం పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై నెలలో ఇప్పటి వరకు 49,022 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యి రూ.419.19 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే రోజుకు సగటున 3,501 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి దాదాపు రూ.30 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వనకూడుతోంది.

ఒక్కరోజే 55.56 కోట్ల రాబడి..

కాని బుధవారం ఒక్క రోజునే 6,187 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరిగాయి. తద్వారా రూ. 55.69 కోట్లు రాబడి ప్రభుత్వానికి వచ్చింది. అంటే దాదాపు రెట్టింపు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడంతోపాటు రాబడి కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కరోనా ప్రభావంతో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు ఆగినా ఆ తరువాత క్రమంగా రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాది మూడున్నర నెలల్లో 2.74లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యి తద్వారా రూ.1770.42 కోట్లు రాబడి వచ్చింది.

సంబంధిత కథనం:Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం

Last Updated : Jul 15, 2021, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details