Property Tax News: ఆస్తిపన్ను బకాయిదారులకు పురపాలకశాఖ శనివారం శుభవార్త చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఓటీఎస్(వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం)ను ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. అక్టోబరు 31తో గడువు ముగియనుంది.
గుడ్‌న్యూస్.. ఆస్తి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ - ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ
Property Tax News: పురపాలకశాఖ ఆస్తిపన్ను బకాయిదారులకు శుభవార్త చెప్పింది. 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఓటీఎస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తూ ఆ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్థిక సంవత్సరం 2021-22 వరకు ఉన్న బకాయిలను 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ బకాయిలను పూర్తి వడ్డీతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జులై 16 మధ్య చెల్లించి ఉంటే.. వారికీ ఓటీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన వడ్డీలో 90 శాతాన్ని వెనక్కు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆస్తిపన్ను డిమాండ్‌లో సర్దుబాటు చేస్తారు. 2020 ఆగస్టులో కూడా ప్రభుత్వం ఇదే మాదిరి ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: