బంగాళాఖాతంలో మలయా ద్వీపకల్పం వద్ద బుధవారం ఉదయం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ సంచాలకులు నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం(4న) అల్పపీడనం ఏర్పడే అవకాశముందన్నారు.
రేపు అల్పపీడనం.. చలి తీవ్రత పెరిగే అవకాశం - cold is increasing in telangana
బంగాళాఖాతంలో మలయా ద్వీపకల్పం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రాత్రిపూట చలి పెరగనుందని తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పగలు పొడివాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రిపూట మళ్లీ చలి పెరుగుతోందన్నారు. మంగళవారం రాత్రి అత్యల్పంగా కోహీర్(సంగారెడ్డి జిల్లా)లో 10.4, గిన్నెధరి(కుమురం భీం)లో 11, మర్పల్లి(వికారాబాద్)లో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.