కరోనా ప్రభావం అందరి జీవితాలపై ప్రభావం చూపెడుతుంది. ప్రయాణానికి ప్రజా రావాణాపై ఆధారపడే వారంతా ఇప్పుడు సొంత వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం ఉంటే.. ఎవరితో ఇబ్బంది లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు గమ్యానికి చేరుకోవచ్చని, కరోనా నుంచి కూడా కాస్త ఉపశమనం పొందవచ్చని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో భౌతిక దూరం పాటించడం కష్టసాధ్యం.. అదే సొంత వాహనమైతే..ఆ ఇబ్బందులు ఉండవని సొంత వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
సంవత్సరం | నెల | అమ్ముడుపోయిన వాహనాల సంఖ్య |
2019-20 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 3,76,596 (ద్విచక్రవాహనాలు) |
2020-21 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 2,62,289 (ద్విచక్రవాహనాలు) |
2019-20 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 62,099 (కార్లు) |
2020-21 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 42,178 (కార్లు) |
సంవత్సరం | నెల | మొత్తం అమ్ముడుపోయిన వాహనాల సంఖ్య |
2019-20 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 4,99,731 |
2020-21 | ఏప్రిల్ -సెప్టెంబర్ | 3,54,529 |
ఓ ద్వికచ్ర వాహన కంపెనీ సంస్థ ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించినట్లు చెబుతోంది. గత పండగ సీజన్లతో పోల్చుకుంటే..ఇది చాలా ఎక్కువ అని ఆ సంస్థ సేల్స్ మేనేజర్ వెల్లడించారు.
పెరిగిన వాహన కొనుగోళ్లు
గడిచిన రెండు నెలల్లో వాహన కొనుగోళ్లు ఎక్కువగానే జరిగినట్లు రవాణాశాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ మాసంతో పోల్చితే.. నవంబర్లో స్వల్పంగా తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటం వల్ల నెలాఖరుకు అమ్మకాలు ఊపందుకుంటాయని వాహన డీలర్లు పేర్కొంటున్నారు.