డెలివరీ జరిగి రోజైనా గడవక ముందే.. బిడ్డతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది ఓ తల్లి. ఏపీ, కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పురిటి బిడ్డతో.. ఓటు వేసిన మహిళ - delivery lady votes update
ఓ అమ్మ.. పోలింగ్ కేంద్రానికి బిడ్డతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. ఇందులో కొత్తేముంది.. ప్రతి ఒక్కరూ చేసే పనేగా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఆ బిడ్డ వయసు కేవలం ఒక రోజేనని తెలుసుకోండి. ఏపీ, కర్నూలులో ఇది జరిగింది.

పురిటి బిడ్డతో ఓటు వేసిన మహిళ
పత్తికొండకు చెందిన ఉప్పర లక్ష్మీదేవి మంగళవారం రాత్రి.. బిడ్డకు జన్మనిచ్చారు. రోజైనా గడవకముందే.. పోలింగ్ కేంద్రానికి బిడ్డతో సహా వెళ్లి ఓటు వేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ఇదీ చదవండి:గుమ్మడికాయ కాదు టమాటానే!