Revanth and Rajagopal Reddy Tweet War : దిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనకు సంబంధం ఉందంటూ భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘రేవంత్‌రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు దిల్లీ లిక్కర్ కుంభకోణం తెర దించింది, దిల్లీలో తీగ లాగితే ప్రగతిభవన్, గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది’ అంటూ రాజగోపాల్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్.. రేవంత్, రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వార్ - దిల్లీ లిక్కర్ స్కామ్ లేటెస్ట్ న్యూస్
Revanth and Rajagopal Reddy Tweet War : మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయనకు, టీపీసీసీ రేవంత్ రెడ్డికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. తాజాగా ఆ వార్ ట్విటర్‌లోకి చేరింది. ఇరువురు నేతలు ట్విటర్ వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దిల్లీ లిక్కర్ కుంభకోణంతో తనకు సంబంధం ఉందంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ తీవ్రంగా ఖండించారు.
![దిల్లీ లిక్కర్ స్కామ్.. రేవంత్, రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వార్ Revanth and Rajagopal Reddy Tweet War](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16331345-299-16331345-1662777420615.jpg)
Revanth and Rajagopal Reddy Tweet War
దీనిపై శుక్రవారం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ఖండించారు. ఇలాంటి చిల్లర కథలు..మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవని పేర్కొన్నారు.2010 ఫిబ్రవరి 2న అడికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రై.లి.కంపెనీలో డైరెక్టర్‌గా చేరి, 13 రోజుల్లో అంటే ఫిబ్రవరి 15న రాజీనామా చేశానని, ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో ఆ కంపెనీ క్లోజ్ అయిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ట్వీట్‌కు జత చేశారు. ‘చచ్చిన బర్రె పగిలిన కుండ నిండా పాలిచ్చిందన్నట్టు’ రాజగోపాల్ వ్యవహారం ఉందన్నారు.
TAGGED:
దిల్లీ లిక్కర్ స్కామ్