తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు - తెలుగు రాష్ట్రాలపై దిల్లీ ఆంక్షలు న్యూస్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఆ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్​ను గుర్తించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Restrictions on travelers from Telugu states to Delhi
తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీకి వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు

By

Published : May 7, 2021, 9:29 AM IST

తెలంగాణ, ఏపీల నుంచి వచ్చే ప్రయాణికులపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. 14 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్​లో ఉండాలని స్పష్టం చేస్తూ.. దిల్లీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వైరస్​లో మార్పులు వచ్చినట్లు కనుగొన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

'విమానాలు, రైళ్లు, బస్సులు, కార్లు , ట్రక్కులతోపాటు ఇతర ఏ రవాణా మార్గంలో వచ్చినా క్వారంటైన్​లో ఉండాలి. అందకుయ్యే ఖర్చును వారే భరించాలి. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా.. ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్ష చేయించుకున్న తర్వాత నెగెటివ్ వచ్చినా.. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపిన వారు వారం రోజులపాటు హోం క్వారెంటైన్​లో ఉండాలి' అని తెలిపింది. రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారు. వారి సిబ్బందికి కరోనా లక్షణాలు లేకపోతే ఈ షరతుల నుంచి మినహాయింపునిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:ఆక్సిజన్, రెమ్​డెసివర్, టీకా డోసులను ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details