గతంలో ఎన్నడూ లేనంతగా భాగ్యనగరం వరదలను ఎదుర్కొంటోంది. భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు వరదలో చిక్కుకుని.. భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్ట చవిచూశాయి. ఇప్పటికే కోరలు చాచిన కరోనాతో పోరాడుతున్న రాష్ట్రంలో వరదలు మరింత భయానకం సృష్టించాయి.
రాష్ట్రానికి దిల్లీ సీఎం ఆర్థికసాయం..కేజ్రీవాల్‌కు కేసీఆర్ కృతజ్ఞతలు
భారీ వర్షంతో భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వరదలతో అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా ఎంతో నష్టం చవిచూసిన తెలంగాణకు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నాయి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు. రాష్ట్రానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్.. కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షం, వరదలతో ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకున్న తెలంగాణను ఆపద సమయంలో ఆదుకోవడానికి దిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు ముందుకొచ్చారు. ఇప్పటికే తమిళనాడు సీఎం తెలంగాణకు రూ.10 కోట్ల విరాళంతో పాటు రిలీఫ్ మెటీరియల్ పంపుతున్నారు. తాజాగా దిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్రానికి రూ.15 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. కష్టకాలంలో తెలంగాణకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
విపత్తు సమయంలో తెలంగాణకు అండగా నిలుస్తోన్న తమిళ, దిల్లీ ముఖ్యమంత్రులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకుంటున్నందుకు పళనిస్వామి, కేజ్రీవాల్‌లకు ఫోన్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.