తెలంగాణ

telangana

ETV Bharat / city

డిగ్రీ రెండో విడతలో 66 వేల 641 మంది విద్యార్థులకు సీట్లు - దోస్త్​ వార్తలు

డిగ్రీ రెండో విడతలో 66 వేల 641 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈనెల 27 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.

Second Phase Seats Allotment
డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపు

By

Published : Aug 26, 2021, 4:02 AM IST

డిగ్రీ రెండో విడతలో 66 వేల 641 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. కొత్తగా 15 వేల 194 మందికి.. గతంలో సీటు పొందిన 51 వేల 447 మందికి మెరుగైన సీట్లు దక్కాయి. ఈనెల 27 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్ కన్వీనర్, ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబారెడ్డి తెలిపారు. ఈనెల 27 నుంచి సెప్టెంబరు 15 వరకు దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు, ఈనెల 27 నుంచి సెప్టెంబరు 20 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

సెప్టెంబరు 4న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నట్లు లింబాద్రి తెలిపారు. సెప్టెంబరు 24 నుంచి 27 వరకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. సీటు వచ్చిన కాలేజీలోనే మరో కోర్సుకు మారేందుకు సెప్టెంబరు 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. 30న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 24 నుంచి 30 వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి.. అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్ల లింబాద్రి తెలిపారు.

ఇదీ చదవండి:traffic Restrictions: ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్​బండ్​పై ట్రాఫిక్​ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details