Evaluation with students: ఏపీలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థులు భాగస్వామ్యం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో సహాయ ఎగ్జామినర్‌తో పాటు ఓ విద్యార్థి కూడా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో అంబేడ్కర్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సిహెచ్.ఎ.రాజేంద్రప్రసాద్, ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్‌లు బుధవారం కళాశాలకు వచ్చి విచారణ చేపట్టారు.
'డిగ్రీ పరీక్ష పేపర్లు దిద్దిన విద్యార్థులు'
Evaluation with students : విద్యార్థి పరీక్ష రాయడం.. ఉపాధ్యాయుడు మార్కులేయడం సాధారణం. కానీ.. విద్యార్థులు రాసిన పరీక్షా పత్రాలను మరో విద్యార్థే దిద్దితే..? అతనే మార్కులు వేస్తే..? డిగ్రీ పరీక్ష పత్రాలను మరో విద్యార్థి మూల్యంకనం చేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యవహారం వెలుగు చూసింది..!
మూల్యాంకనం అనంతరం మార్కులను ఓఎంఆర్ పత్రంలో బబ్లింగ్ చేసేందుకు విద్యార్థులను వినియోగించినట్లు సిబ్బంది వారికి వివరించారు. వర్సిటీ ఉపకులపతి నిమ్మ వెంకటరావుకు దీనిపై నివేదిక అందిస్తామని, ఆయన సూచన మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ డా.పి.సురేఖ స్పందించారు. సహాయ ఎగ్జామినర్‌ను మూల్యాంకన ప్రక్రియ నుంచి తొలగించామని తెలిపారు. ఇక్కడ మూల్యాంకనం జరిగిన సమాధానపత్రాలు ఈ రీజియన్‌కు సంబంధించినవి కావని వివరించారు.
ఇవీ చదవండి:చెప్పులు లేకుండా పరుగెత్తింది.. మహిళా సత్తా ఎలుగెత్తింది