తెలంగాణ

telangana

ETV Bharat / city

అక్కడ వాట్సాప్​ వీడియోలో మంత్రాలు.. ఇక్కడ కర్మకాండలు - గుంటూరులో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కర్మకాండల నిర్వహణ వార్తలు

తమ ఆత్మీయుడు కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. అతని కర్మక్రియలు సంప్రదాయం ప్రకారం జరిపించాలని ఆ బంధువులు తలిచారు. అయితే లాక్​డౌన్​ వారి పాలిట శాపంగా మారింది. చివరకు వాట్సాప్​ వీడియో కాల్​లో పురోహితుడు మంత్రాలు చదువుతుండగా వీరు ఉంటున్న చోట తంతు పూర్తి చేశారు.

death rituals done through whatsupp video call in guntur district
death rituals done through whatsupp video call in guntur district

By

Published : Apr 30, 2020, 4:40 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన చెన్ను గోపీచంద్​ పదిరోజుల క్రితం చనిపోయారు. అతని కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం విశిష్ట అద్వైత పురోహితుని ఆధ్వర్యంలో కర్మకాండలు జరిపించాలని నిర్ణయించారు. అయితే లాక్​డౌన్​తో పురోహితులు అందుబాటులో లేకపోవడం వల్ల వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలోని పండితుడు వారి వేదనను గుర్తించి వారికి వాట్సాప్​ వీడియో కాల్​లో మంత్రాలు చదివి వినిపిస్తుండంగా వారు గుంటూరు జిల్లాలో శ్రాద్ధకర్మల తంతు పూర్తి చేశారు. తమ ఆత్మీయుని ఆత్మకు శాంతి కలిగేలా పండితుని ఆధ్వర్యంలో ఈ విధంగా కర్మక్రియలు జరిపించడంపై మృతుని బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details