తెలంగాణ

telangana

ETV Bharat / city

సండే బ్యాంకింగ్.. డీసీసీబీ బ్యాంక్ వినూత్న ఆలోచన - dccb Bank latest news at vikarabad

వికారాబాద్ డీసీసీబీ బ్యాంక్ శాఖలో ప్రయోగాత్మకంగా సండే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆదివారం నాడు బ్యాంకు సేవలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుని.. సేవల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలన్నారు.

DCCB Bank Innovative Idea Sunday Banking started at vikarabad
సండే బ్యాంకింగ్.. డీసీసీబీ బ్యాంక్ వినూత్న ఆలోచన

By

Published : Jan 3, 2021, 3:45 PM IST

జాతీయ బ్యాంకులతో సమానంగా సహాకార బ్యాంకుల్లో సేవలందిస్తామని హైదరాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ డీసీసీబీ బ్యాంక్ శాఖలో ప్రయోగాత్మకంగా ఆదివారం బ్యాంకింగ్ కార్యకలాపాలను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​తో కలసి ప్రారంభించారు.

ఆదివారం బ్యాంకు సేవలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తేనే మనుగడ ఉంటుందన్నారు. నిత్య నూతనంగా ప్రజలకు చేరువ కావడానికి, సేవల పట్ల విశ్వాసం కల్పించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు వార్షిక లావాదేవీలు రూ.1200 కోట్లుగా ఉన్నాయని.. రానున్న ఏడాదిలో 2 వేల కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. భవిష్యత్​లో మరిన్ని శాఖల్లో ఆదివారం బ్యాంకింగ్ అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇదీ చూడండి: కొవాగ్జిన్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్.. త్వరలోనే పంపిణీ

ABOUT THE AUTHOR

...view details