హైదరాబాద్ విశ్వనగరాన్ని తెరాస ప్రభుత్వం విషాద నగరంగా మార్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఏడేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యంలో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీకి అవసరమైన నిధులు కేటాయించకుండా ఓపెన్ నాలాలు, మరమ్మతులు చేయకపోవడం వల్లే.. భాగ్యనగరానికి ఈ దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.
'నిర్లక్ష్య వైఖరితో విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు' - హైదరాబాద్ వానలు వార్తలు
ఏడేళ్ల తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. హైదరాబాద్ విశ్వనగరం కాస్త విషాదనగరంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి... వర్షం బాధితులకు సాయం అందించాలని దాసోజు డిమాండ్ చేశారు.
'నిర్లక్ష్య వైఖరితో విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు'
భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్యనూ తప్పుగా చూపిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ ఉన్నట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న నగరవాసులకు కార్పొరేటర్లు కనిపించడం లేదని... ప్రజలకు కనీసం తినేందుకు ఆహారం ఇచ్చే పరిస్థితిలో కూడా లేరని ఆరోపించారు.
ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు