తెలంగాణ

telangana

ETV Bharat / city

Durgam cheruvu: దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జిపై ఇకపై వారి పప్పులు ఉడకవు... - సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ వార్తలు

చేతిలో ద్విచక్ర వాహనం... విశాలమైన రోడ్డు ఉంటే యువత విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫోటోలకు ఫోజులు ఇస్తూ తమకు ఎదురేలేదంటూ కాలర్ ఎరగేస్తారు. దుర్గం చెరువు తీగల వంతెనపై మాత్రం ఆ పప్పులు ఉడకవు. వాహనం ఆగిందంటే చలాన్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్ పడటం ఖాయం.

Cable Bridge
Cable Bridge

By

Published : Aug 12, 2021, 4:22 AM IST

Updated : Aug 12, 2021, 9:16 AM IST

హైదరాబాద్‌ దుర్గం చెరువు తీగల వంతెనపై నృత్యం చేసి సామాజిక మాధ్యమాల్లో పెడితే ఎక్కువ లైకులు వస్తాయని అనుకున్నాడో... లేక ఎవరైనా సలహా ఇచ్చారో తెలియదు కానీ.. రోడ్డుపై అటూ ఇటూ దూకుతూ ఎలా నృత్యం చేస్తున్నారు పలువురు. పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన మార్గం నుంచి వాహనాలు వెళ్లే రోడ్డుపైకి ఓ వ్యక్తి వచ్చాడు. స్నేహితుడిని పిలిచి రికార్డ్ చెయ్యమని చెప్పి నృత్యం చేశాడు. ఇంతలో సైబరాబాద్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి గమనించిన పోలీసులు... రోడ్డుపై పాదాచారులు రావడం నిషేధమని హెచ్చరించారు. అయినా నృత్యం చేసి అక్కడి నుంచి జారుకున్నాడు.

నువ్వు వద్దు నీ ఫోటో వద్దు

వంతెనపై వాహనం నిలిపేందుకు అనుమతి లేకున్నా... ఓ వ్యక్తి స్నేహితులతో కలిసి ఫోటో దిగడానికి బైక్‌ పార్క్‌ చేశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కంట్రోల్ రూమ్ నుంచి అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాదుడు గుర్తొచ్చి.. నువ్వు వద్దూ... నీ ఫోటో వద్దంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

తిక్క కుదిరింది..

తాజాగా మరికొంత మంది యువకులు హద్దుమీరి ప్రయత్నించారు. ద్విచక్ర వాహనాలతో తీగల వంతెనపైకి వచ్చిన ఆరుగురు బైకులతో విన్యాసాలు చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా... వినకుండా రోడ్డుకు అడ్డంగా ద్విచక్రవాహనాలు ఆపి హంగామా చేశారు. కంట్రోల్ రూమ్ సమాచారంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు... యువకులను స్టేషన్‌కు తరలించారు. జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

ఇదీ చూడండి:AUGUST 15TH: బిజీబిజీగా గోల్కొండ కోట.. కవాతుకు పోలీసులు సన్నద్ధం

Last Updated : Aug 12, 2021, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details