తెలంగాణ

telangana

ETV Bharat / city

వివరాలు ఇవ్వరు... బకాయిలివ్వాలని ఒత్తిడి చేస్తారు...! - విజయ డెయిరీ

పాల ఉత్పత్తి పెంపు లేదు.. పాడి రైతుల పేర్లు లేవు.. బ్యాంకు ఖాతాల వివరాలు లేవు.. పాడి రైతుల సంఖ్యకనుగుణంగా పాల సేకరణా లేదు. ప్రోత్సాహకాల పేరుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు తీసుకుంటున్న డెయిరీలు చేస్తున్న మాయాజాలం ఇది. పాలు, రైతుల లెక్కలు సమర్పించడం లేదు. అయినా 2.13 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన 20 నెలల బకాయిలను త్వరగా విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో నిజంగా డెయిరీలు చెబుతున్నంత మంది రైతులున్నారా, వారందరూ పాలు పోస్తున్నారా, బోగస్‌ పేర్లతో పాలు పోస్తున్నట్లు లెక్కలు చూపుతున్నాయా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Dairy farmers details are not given but forced to pay arrears
Dairy farmers details are not given but forced to pay arrears

By

Published : Mar 15, 2021, 8:43 AM IST


ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విజయ డెయిరీతో పాటు కరీంనగర్‌, ముల్కనూర్‌, నల్గొండ- రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార డెయిరీల పరిధిలోని పాడి రైతులకు ప్రభుత్వం లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. ఇక నుంచి రూ.4 ప్రోత్సాహకంలో రూ.3 మాత్రమే ఇస్తామని.. మిగిలిన రూపాయి డెయిరీ యాజమాన్యమే రైతు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏ రైతు ఖాతాలో ఎంత వేశారో పేర్లు, బ్యాంకు ఖాతా వివరాలివ్వాలని ఆదేశించింది. ఒక్క విజయ డెయిరీ మాత్రమే వివరాలు సమర్పించింది. 65 వేల మంది రైతులు సగటున రోజుకు 4.61 లీటర్లు చొప్పున సుమారు 3 లక్షల లీటర్ల పాలను పోస్తున్నారంటూ వారి బ్యాంకు ఖాతాలు, వారికి జమచేసిన సొమ్ము వివరాలను అందజేసింది.

మిగిలిన 3 డెయిరీల పరిధిలో 1.48 లక్షల మంది రైతులు రోజుకు సగటున 4 లీటర్లు పోసినా సుమారు 6 లక్షల లీటర్లు 3 డెయిరీలకు రావాలి. అందులో సగమైనా రావడం లేదు. రాష్ట్రంలో పాల కొరత వల్ల విజయ డెయిరీ కర్ణాటక నుంచి నిత్యం 50 వేల లీటర్ల పాలను కొంటోంది. డెయిరీల లెక్కల ప్రకారం.. 2.13 లక్షల మంది రైతులుంటే పాల కొరత ఎందుకు ఏర్పడుతోందని ప్రభుత్వం అనుమానిస్తోంది. పాల సేకరణ వివరాలను ఈ-ల్యాబ్‌ పోర్టల్‌లో డెయిరీలు నమోదు చేయడం లేదు. పైగా, ‘ఒక రూపాయి తరవాత జమ చేస్తాం. ముందు రూ.3 అయినా వెంటనే జమ చేయండి’ అని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. డెయిరీలు చెపుతున్నట్లుగా 2.12 లక్షల మంది రైతులు నిత్యం పాలు పోస్తుంటే రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగాలని, క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందని ఓ డెయిరీ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. లోతుగా విచారణ చేస్తే అన్ని బయటకొస్తాయన్నారు.

వివరాలిచ్చాకే ప్రోత్సాహకాలు విడుదల చేస్తాం

ప్రతి రైతు పేరు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సిందేనని డెయిరీలను అడిగాం. ఇంతవరకూ ఇవ్వని మాట వాస్తవమే. ప్రతి రైతు ఖాతాలో ఒక్క రూపాయి చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రతి డెయిరీ జమ చేసి ఆ వివరాలు ఇచ్చిన తరువాతే మిగిలిన రూ.3 విడుదల చేస్తాం. వివరాలివ్వని డెయిరీలకు నిధుల విడుదల ఆపేస్తాం. - అనితా రాజేంద్ర, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి.

ఇదీ చూడండి:ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details