కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో సగటున రోజుకు డయల్ 100కు 76,937 కాల్స్ వచ్చేవి. అయితే.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సంఖ్య 68,582కి తగ్గాయి. ఏప్రిల్ 6న రోజులు దాదాపు 80 వేల ఫిర్యాదు కాల్స్ రాగా.. ఏప్రిల్ 20 నాడు 68,582 ఫిర్యాదులు నమోగదయ్యాయి. అంటే.. సగటున రోజుకు తొమ్మిది వేల కాల్స్ వరకు తగ్గాయి. డయల్ 100 కు వచ్చే కాల్స్‌లో చాలా వరకు వ్యక్తిగత గొడవలు, బెదిరింపులు, చిన్న చిన్న కేసులు, వివాహాలు జరిగినప్పుడు పెద్ద శబ్దంతో సంగీతం పెట్టడం వంటి వాటికి సంబంధించినవే ఎక్కువగా ఉండేవి. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల వ్యక్తిగత గొడవలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ తగ్గిపోయాయి. ఏప్రిల్ 6 వరకు ఈ తరహా ఫిర్యాదులు రోజుకు 5,278 రాగా... ఏప్రిల్ 20 నాటికి సగానికి పైగా 2048కు తగ్గిపోయాయి. ప్రస్తుతం కరోనాకు సంబంధించిన ఫిర్యాదులు కూడా తగ్గుతున్నాయి. కరోనా మొదలైన కొత్తలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా అనుమానంతో డయల్ 100కు ఫోన్ చేసేవారు. అయితే ప్రజల్లో ఇప్పుడు అవగాహన పెరిగిందని... ప్రతిదాన్ని అనుమానంగా చూసే ధోరణి తగ్గి.. ఫిర్యాదులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు.
డయల్ 100కి.. ఫిర్యాదులు తగ్గాయ్!
రాష్ట్రంలో కరోనా కట్టడి, వైరస్ సోకినట్టు ఎవరి మీద అయినా అనుమానం వస్తే 100 కి డయల్ చేయమని పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే.. ప్రారంభంలో రోజుకు 150కి పైగా ఫిర్యాదులు రాగా.. ఇప్పుడు ఫిర్యాదులు తగ్గాయి.
బలవంతంగా ఇంటి అద్దె వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో... అద్దె కోసం ఇంటి యజమాని బలవంతం చేస్తున్నారంటు.. ఆదేశాలు వచ్చిన మరుసటి రోజే డయల్100కు 57 ఫిర్యాదులు వచ్చాయి. మరి కొంతమంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక పోలీసులు ఇంటి యజమానితో మాట్లాడి సర్దుబాటు చేస్తున్నారు. ఇంటి అద్దె విషయంలో మాట వినని వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇవీచూడండి:విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం