Daikin in sri city: డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి గురువారం ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా.. దక్షిణ భారతదేశంలో మొదటిది. శ్రీ సిటీలోని కేంద్రాన్ని భారత్లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్స్ మసయుకి టాగా, ప్యుజిత, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్జీత్ జావా శంకుస్థాపన నిర్వహించారు. దాదాపు 75.5 ఎకరాల స్థలంలో రూ.1,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
Daikin in sri city: ఏపీలో ప్రముఖ సంస్థ పెట్టుబడులు.. మూడువేల మందికి ఉపాధి
Daikin in sri city: ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా.. దక్షిణ భారతదేశంలో మొదటిది.
ఏపీలో ప్రముఖ సంస్థ పెట్టుబడులు