వాహనదారులకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ట్విటర్ ద్వారా క్విజ్ పోటీలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విటర్ ఫాలో అవుతున్న పలువురు నెటిజన్లు.. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు.
ట్రాఫిక్ నియమాలపై సైబరాబాద్ పోలీసుల అవగాహన - quiz competition in twitter
వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ట్విటర్ ద్వారా ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు.
ట్రాఫిక్ క్విజ్, సైబరాబాద్ ట్రాఫిక్ క్విజ్, ట్విటర్లో ట్రాఫిక్ క్విజ్
సరైన సమాధానం ఇచ్చిన వారిని పోలీసులు ప్రశంసిస్తూ.. మిగతా వారికి రహదారి నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. కొంతమంది ట్రాఫిక్ నియమాల గురించి తెలియక తప్పులు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు.