క్యూనెట్‌లో ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల మేర మోసం జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 38 కేసులు నమోదు చేసి.. 70 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకూ నోటీసులు పంపించామని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దిల్లీ, మహారాష్ట్ర, బెంగళూరులో క్యూనెట్‌పై కేసులు నమోదైనట్లు సజ్జనార్ వివరించారు. 206(5) కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఎంసీఏ ( కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) ఆధ్వర్యంలో విచారణ జరిగినట్లు తెలిపారు. క్యూనెట్‌పై చర్యలు తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు ఎంసీఏ ఫిర్యాదు చేసిందన్నారు. క్యూనెట్ కేసులో 12 మందికి ఎల్వోసీ జారీచేశామన్నారు. క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ సెల్లింగ్ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.