తెలంగాణ

telangana

ETV Bharat / city

stephen Ravindra: మంత్రి కేటీఆర్​ను కలిసిన సైబరాబాద్​ సీపీ - మంత్రి కేటీఆర్​ను కలిసిన సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా నూతనంగా నియమితులైన స్టీఫెన్‌ రవీంద్ర మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

stephen Ravindra
stephen Ravindra

By

Published : Aug 27, 2021, 4:15 PM IST

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర... మంత్రి కేటీఆర్​ను కలిశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ముద్రణ, స్టేషనరీ విభాగం డీజీగా నియమితులైన ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌ షరాఫ్‌... హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు పాటు భేటీ అయ్యారు.

1990 బ్యాచ్ అధికారి..

రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహించిన స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్​లో డీసీపీగాను పనిచేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​గా పని చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సమర్థవంతంగా పని చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత స్టీఫెన్ రవీంద్రను తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది రాష్ట్రంలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్‌‌గా ఉన్నారు.

ఇదీ చూడండి: stephen ravindra: సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details