మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కుట్రలో భాగమైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్‌తో మహబూబ్‌నగర్ వాసులే హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరిగిందనేందుకు ఆధారాలు లభించాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. దాదాపు 15 కోట్లతో సుపారీ ఒప్పందం జరిగిందని దర్యాప్తులో తేలిందన్నారు. సుపారీ హత్య కోసం మొదట ఫరూక్ అనే వ్యక్తిని ఆశ్రయించగా.. అతడు బయటపెడతాడేమో అనే భయంతో అతడిని చంపేందుకు ప్రయత్నించారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న ఫరూక్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించాం అన్నారు. అక్కడి నుంచి ప్రారంభమైన దర్యాప్తులో భాగంగానే.. మంత్రిపై హత్య కుట్ర విషయం బయటపడిందని తెలిపారు. ఈ మొత్తం కుట్రలో తమకు ప్రధానంగా ముగ్గురి పేర్లు బయటపడ్డాయని.. మిగతావారి పాత్రపైనా కూడా ఆరా తీస్తున్నామని సీపీ వెల్లడించారు.
ఈ కుట్ర ఎలా బయటపడిందంటే..?
ఫిబ్రవరి 23న ఫరూక్, హైదర్ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జీలో దిగారు. ఫిబ్రవరి 25న ఫరూక్, హైదర్‌పై ఒక ముఠా దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని.. తమపై హత్యాయత్నం జరిగిందని పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వాళ్లిద్దరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దాడికి యత్నించింది.. యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అని తేలింది. ఫిబ్రవరి 26న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారించారు. విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్ ప్రమేయం ఉన్నట్లు నిందితులు బయటపెట్టారు. అసలు ఇంత మంది ఫరూక్, హైదర్ల మీద ఎందుకు దాడి చేశారని లోతుగా విచారిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ ముఠా అంతా కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిసింది.
అక్కడే అంతా మలుపు తిరిగింది..