సైబరాబాద్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు పటిష్ఠంగా అమలవుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, చింతల్, షాపూర్‌నగర్, అల్విన్ కాలనీ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలును స్వయంగా పరిశీలించారు.
సైబరాబాద్‌లో కఠినంగా లాక్‌డౌన్ అమలు : సీపీ సజ్జనార్ - తెలంగాణ వార్తలు
సైబరాబాద్‌లో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం కావడంతో భారీగా జనం వస్తారన్న అంచనాతో మరింతమంది సిబ్బందితో తనిఖీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సీపీ సజ్జనార్, లాక్‌డౌన్ అమలుపై సీపీ సజ్జనార్
10 గంటల తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలను మూసేయించి... అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలని సజ్జనార్ సూచించారు.
లాక్‌డౌన్ అమలును పరిశీలించిన సీపీ సజ్జనార్
- ఇదీ చదవండి :ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?