దిల్లీకి వెళ్లిన సీపీ సజ్జనార్.. రేపు సుప్రీం విచారణకు హాజరు - disha accused encounter news
20:16 December 10
దిల్లీకి వెళ్లిన సీపీ సజ్జనార్.. రేపు సుప్రీం విచారణకు హాజరు
దిశ నిందితుల ఎన్కౌంటర్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేసు విచారణకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ దిల్లీకి వెళ్లారు. న్యాయవాదులకు పూర్తి సమాచారం ఇచ్చి స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
దిశ హత్యాచారం, ఎన్కౌంటర్ ఘటనపై నాలుగు రోజుల పాటు జాతీయ మానవహక్కుల సంఘం చేసిన విచారణ ముగిసింది. హైదరాబాద్ వచ్చిన బృందం పూర్తి వివరాలను సేకరించి ఓ నివేదిక తయారుచేసినట్లు సమాచారం.