పేలుడు పదార్థాలను గుర్తించే శిక్షణ పొందిన రెండు పోలీసు జాగిలాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సన్మానించారు. డేసీ, లక్కీ అనే రెండు జాగిలాలు మోయినాబాద్‌లోని జాగిలాల శిక్షణ కేంద్రంలో పేలుడు పదార్థాలను గుర్తించే శిక్షణ పొందాయి. కానిస్టేబుళ్లు సురేష్, మహేందర్ వీటికి ఎనిమిది నెలల పాటు శిక్షణ ఇచ్చారు.
పోలీసు జాగిలాలను సన్మానించిన సీపీ సజ్జనార్ - పోలీసు జాగిలాలను సన్మానించిన సీపీ సజ్జనార్
రెండు పోలీసు జాగిలాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సన్మానించారు. డేసీ, లక్కీ అనే రెండు జాగిలాలు మోయినాబాద్‌లోని జాగిలాల శిక్షణ కేంద్రంలో పేలుడు పదార్థాలను గుర్తించే శిక్షణ పొందాయి. జాగిలాలకు శిక్షణ ఇస్తున్న కానిస్టేబుళ్లు మహేందర్, సురేష్‌ను సజ్జనార్ అభినందించారు.
cp sajjanar
పేలుడు పదార్థాలను గుర్తించే విభాగంలో లక్కీ అనే జాగిలం రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి పొందింది. జాగిలాలకు శిక్షణ ఇస్తున్న కానిస్టేబుళ్లు మహేందర్, సురేష్‌ను సజ్జనార్ అభినందించారు. వారిద్దరికి నగదు పురస్కారాలు అందజేశారు.
ఇదీ చదవండి :శిరస్త్రాణం లేదా?.. లైసెన్స్ గల్లంతే..!