నకిలీ ఈ-మెయిల్‌తో 60 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. హైదరాబాద్‌కి చెందిన ట్రైకాడ్ డిజైనర్ కన్సల్టెన్సీ అనే కంపెనీ అమెరికాకి చెందిన ఓ కంపెనీతో 18 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తుంది. ఈ కంపెనీల లావాదేవీలను తెలుసుకున్న కేటుగాళ్లు యూఎస్ కంపెనీకి చెందిన ఈ-మెయిల్ తరహాలో నకిలీది తయారు చేశారు. దీనితో ట్రైకాడ్ కంపెనీకి 60 లక్షలు తాము మెయిల్ చేసిన అకౌంట్ నంబర్‌కి బదిలీ చేయాలని సూచించారు.
నకిలీ మెయిల్‌తో సంస్థకు భారీ టోకరా - Tricode Designer Consultancy Company, Hyderabad
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో చెలరేగిపోతున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లూటీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనినీ కేటుగాళ్లు నిలువు దోపిడీ చేశారు.
నకిలీ మెయిల్‌తో సంస్థకు భారీ టోకరా
ఇది నమ్మిన ఆ సంస్థ ప్రతినిధులు సంబంధింత అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం యూఎస్ కంపెనీకి సంప్రదించగా తమకు ఎలాంటి డబ్బులు రాలేదని చెప్పారు. తాము మోసపోయామని తెలుసుకొని కంపెనీ ప్రతినిధి శేషగిరిరావు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'