తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆఫర్ల ఉచ్చుతో మోసం.. ఝార్ఖండ్‌ ముఠా అరెస్ట్.. - Crime In Hyderabad

బ్యాంక్​ అధికారుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఝార్ఖండ్‌కు చెందిన ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ-వాలెట్‌, యూపీఐ కోడ్‌లతో... కోట్ల రూపాయలు సంపాదించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. అమెజాన్, స్విగ్గి, ఫుడ్‌పండా పేరిట ఫోన్‌ నంబర్లు పెట్టి మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు.

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు అరెస్టు

By

Published : Nov 20, 2019, 5:38 PM IST

ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాతాల నుంచి అక్రమంగా నగదు చోరీ చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు ఈ-వ్యాలెట్, యూపీఐ కోడ్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు.

ఓ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ...ఆఫర్ల పేరుతో యూపీఐ కోడ్, ఓటీపీ వంటి కీలక సమాచారం సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ సజ్జనర్​ తెలిపారు. ముఠా సభ్యులు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫుడ్‌ పాండా సైట్లలో నకిలీ ఫోన్ నంబర్లు పెట్టి మోసం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు అరెస్టు

ఇదీ చదవండి: తాడేపల్లిలో తనిఖీలు.. హైదరాబాద్ యువకుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details