సైబర్ కేటుగాళ్లను పట్టుకోవడానికి పోలీసులు రోజుకో మార్గాన్ని అన్వేషిస్తుంటే.. వారికి చిక్కకుండా రోజుకో రూట్ మారుస్తూ అమాయకులకు వల వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మొన్నటి దాకా అమెజాన్ స్పిన్ వీల్‌తో బహుమతులు వస్తాయంటూ.. డేటా చోరీ చేసిన కేడీలు.. ఇప్పుడు డీమార్ట్ స్పిన్ వీల్ పేరుతో లింక్‌ను పంపిస్తూ ఎర వేస్తున్నారు.
బహుమతులే ఎర.. అమాయకులకు కి'లేడీ'ల వల - cyber criminals target lovers on valentine's day
రోజుకో పంథా మారుస్తున్న సైబర్ నేరగాళ్లు.. వినూత్న మోసాలకు పాల్పడుతున్నారు. డీమార్ట్ 20 ఏళ్ల ఉత్సవాలు, ప్రేమికుల దినోత్సవం పేరుతో బహుమతులు ఇస్తామని ఎర చూపుతూ అమాయకులకు వల వేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
బహుమతులు ఎర చూపుతూ.. అమాయకులకు సైబర్ వల
ఇటువంటి వారి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. డీమార్ట్ 20 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా వీల్ తిప్పితే బహుమతులు వస్తాయంటూ.. సర్క్యులేట్ అవుతున్న ఈ లింక్‌ను ప్రజలెవరూ క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. స్మార్ట్ ఫోన్ బహుమతి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న లింక్‌లనూ క్లిక్ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.
Last Updated : Feb 4, 2021, 11:09 AM IST