తెలంగాణ

telangana

ETV Bharat / city

CYBER CRIME: పెచ్చుమీరుతోన్న సైబర్​ మోసాలు.. ఆదమరిచామా అంతే సంగతులు..! - CYBER CRIMES IN HYDERABAD

CYBER CRIME: సైబర్​ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా.. మరింత పెరుగుతూనే ఉంది. జంట నగరాల పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ 10కిపైగా కేసులు నమోదవుతున్నాయి. మోసపోయిన బాధితులు సైబర్ క్రైం ఠాణాలకు పరుగులు పెడుతున్నారు. విద్యావంతులు, వృత్తిదారులే బాధితుల్లో అధిక సంఖ్యలో ఉండటంతో పోలీసులపై పని భారం పెరుగుతోంది. మ్యాట్రిమొనీ, పెట్టుబడుల పేరిట, ఇతర వెబ్​సైట్ల ద్వారా లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు తేలిగ్గా కాజేస్తున్నారు.

CYBER CRIME: పెచ్చుమీరుతోన్న సైబర్​ మోసాలు.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు
CYBER CRIME: పెచ్చుమీరుతోన్న సైబర్​ మోసాలు.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు

By

Published : Feb 15, 2022, 5:14 AM IST

సైబర్ నేరగాళ్ల బారినపడతున్న బాధితుల సంఖ్య.. జంట నగరాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు, మీడియా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. పెళ్లి పేరుతో బోయిన్​పల్లికి చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు నిలువునా వంచించారు. లండన్​లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నానంటూ యువతిని నమ్మబలికించాడు. దిల్లీ ఎయిర్​పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని రూ.10 లక్షలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

ఇల్లు అద్దెకు తీసుకుంటామని మెహదీపట్నంకు చెందిన అన్సార్ అహ్మద్ అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. గూగుల్​ పే ద్వారా అడ్వాన్స్​ సొమ్ము చెల్లిస్తామంటూ చెప్పి లింక్ పంపారు. అన్సార్ వివరాలు నమోదు చేయగానే అతడి ఖాతా నుంచి రూ.లక్షా 70 వేలు కొల్లగొట్టారు. ఇంకో కేసులో పేటీఎం కేవైసీ అప్​డేట్​ పేరిట తార్నాకకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖాతా నుంచి లక్షన్నర మాయం చేశారు. పెట్టుబడుల పేరుతో మల్లేపల్లికి చెందిన ఓ యువతికి.. సైబర్ కేటుగాళ్లు రూ.13 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. రుణ యాప్ వేధింపులు ఆపడం లేదంటూ.. యాకూబ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పు మొత్తం తిరిగి చెల్లించినా సన్నిహితులకు కించపరిచే సందేశాలు పంపిస్తున్నారని ఫిర్యాదు చేశాడు.

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని.. వ్యక్తిగత వివరాలు, పిన్​ నెంబర్లు, ఓటీపీలను ఎవ్వరికీ చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: Cyber Frauds: 'నగ్న వీడియోలు, లాభాల గాలాలు..' వారంలో 10 సైబర్​ మోసాలు..

ABOUT THE AUTHOR

...view details