సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్షిప్ పేరుతో ఓ వ్యక్తిని దారుణంగా మోసం చేశారు. అమ్మాయి అనుకొని చాటింగ్ చేసిన రూ.91 వేలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక నిందుతులు నంబర్ బ్లాక్ చేశారు. అప్రమత్తమైన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
సామాజిక మాధ్యమాల వేదికగా సైబర్ నేరగాళ్ల మోసాలు - సైబర్ నేరగాళ్ల మోసాలు
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బొల్లారం ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి రూ. 91 వేలు గుంజారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సామాజిక మాధ్యమాల వేదికగా సైబర్ నేరగాళ్ల మోసాలు
'మీకు సింగిల్ లేడీ కావాలా... గంటలో మీ ఇంట్లో ఉంటుంది' అని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఆసక్తి ఉంటే వాట్సాప్లో సంప్రదించండి అని ఓ చరవాణి నంబరు ఉంచారు. అది చూసి బాధితుడు వాట్సాప్ సందేశం పంపాడు. అమ్మాయి చేసినట్టు నమ్మించి డబ్బులు గుంజారు. డబ్బులు ఖాతాలో జమ కాగానే నంబర్ బ్లాక్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.