తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఝలక్​ ఇచ్చిన కేటుగాళ్లు.. ఫేక్​ ఐడీ క్రియేట్​ చేసి.. - ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఝలక్​ ఇచ్చిన కేటుగాళ్లు.. ఫేక్​ ఐడీ క్రియేట్​ చేసి..
ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఝలక్​ ఇచ్చిన కేటుగాళ్లు.. ఫేక్​ ఐడీ క్రియేట్​ చేసి..

By

Published : Feb 3, 2022, 5:01 PM IST

16:51 February 03

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఝలక్​ ఇచ్చిన కేటుగాళ్లు.. ఫేక్​ ఐడీ క్రియేట్​ చేసి..

జగ్గారెడ్డి పేరిట ఫేక్​ ఐడీ

సైబర్​ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదలడం లేదు. తాజాగా టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఓ ఫేస్​బుక్​ ఐడీ క్రియేట్​ చేశారు కేటుగాళ్లు. ఆ ఫేస్​బుక్​ ఐడీ డీపీగా ఒక అమ్మాయి ఫొటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి చేరడంతో ఆయన అలెర్ట్​ అయ్యారు. తన అనుచరులందిరినీ అప్రమత్తం చేశారు.

నా పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్​బుక్​ ఐడీ క్రియేట్​ చేశారు. ఈ ఫేస్​బుక్​ ఐడీ డీపీగా ఓ అమ్మాయి ఫొటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫొటోలు పెట్టి నా పేరును డ్యామేజ్​ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను దీనిపై సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నా పేరుతో కొత్తగా క్రియేట్​ చేసిన ఫేస్​బుక్​ ఐడీ నాది కాదు. ప్రజలు ఎవరూ మోసపోవద్దు. సైబర్​ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.

-జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details