తెలంగాణ

telangana

ETV Bharat / city

ALUMNI MEET: అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం - cvr college of Engineering

సీవీఆర్ ఇంజినీరింగ్​ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా జరిగింది. రోహిత్ వుప్పల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనంలో 2005- 2019లకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

cvr college allumni association
cvr college allumni association

By

Published : Oct 24, 2021, 4:06 PM IST

Updated : Oct 24, 2021, 4:56 PM IST

సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్​ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అమెరికాలోని డల్లాస్ నగరంలో అక్టోబర్ 23న వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2005- 2019లకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రోహిత్ వుప్పల అధ్యక్షతన ఈ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

alumni meet

తమ కళాశాల ప్రారంభమై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రెండో సభ నిర్వహించారు. విశ్వవ్యాప్తంగా రాణించిన విద్యార్థులంతా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మొదటిది కాలిఫోర్నియా నగరంలో అక్టోబర్ 10న కోలాహలంగా జరిగింది.

అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఛైర్మన్ డా.రాఘవ చిరబుడ్డి ముఖ్య అతిథిగా హజరై.. ఈ 20 సంవత్సరాల్లో కళాశాల సాధించిన విజయాలను, అధిగమించిన మైలురాళ్లను సభావేదికగా పంచుకున్నారు. పూర్వవిద్యార్థుల విశిష్టతను, వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతిని కొనియాడారు. భావితరాలకు తమ విజ్ఞానాన్ని పంచేవిధంగా తదుపరి కార్యాచరణను ప్రకటించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ఇదీ చూడండి:స్పెయిన్ బుల్ రన్​లో ఉద్రిక్తత.. అంతలోనే..!

Last Updated : Oct 24, 2021, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details