ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు - ap curfew extension news
13:10 May 17
ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావంతో విధించిన కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితాలు రావాలంటే.. కనీసం 4 వారాల పాటైనా కర్ఫ్యూ ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ఫ్యూ విధించి 10 రోజులే అయ్యిందని సీఎం గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు చెప్పిన సీఎం .. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు.
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే.. వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారిని ఆదుకునేలా ఆర్థిక సహాయం చేయడంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి:రోజూ లక్ష పరీక్షలు చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పట్టించుకోరా..?