తెలంగాణ

telangana

Curfew in ap : ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు

By

Published : Sep 18, 2021, 10:06 AM IST

Updated : Sep 18, 2021, 10:51 AM IST

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో.. కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.

ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు
ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో మరోసారి కర్ఫ్యూను పొడిగించారు. కర్ఫ్యూ ఆంక్షల్ని ఈ నెల 30 వరకు కొనసాగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Last Updated : Sep 18, 2021, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details