కొవిడ్ కారణంగా ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 వరకు కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. రోజుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై చర్చించిన అధికారులు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
curfew extend In AP: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ - corona cases in andhrapradhesh
కరోనా కారణంగా ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరోసారి పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 వరకు కర్ఫ్యూ నిబంధనలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
![curfew extend In AP: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ curfew extend In AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12780242-535-12780242-1629014710659.jpg)
ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధనలు ఈనెల 21 వరకు కొనసాగుతాయి.
ఇదీచదవండి.