క్యూములోనింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో రహదారిపై చెట్టు పడింది. సింగాలి బస్తీలో ఓ ఇంటి రేకులపై పక్కింటి గోడ కూలిపడింది.
యూసుఫ్ గూడలో ఇంటి నిర్మాణం కోసం కట్టిన కట్టెలు పడిపోయాయి. ప్రేమ్ నగర్ బస్తీలోని లోతట్ట ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అఘాపూరలోని మహాలక్ష్మీ టిఫిన్ సెంటర్ ఎదురుగా చెట్టు కూలింది. మంగళ్ హాట్లోని శివలాల్ నగర్లో వీధులు జలమయమయ్యాయి.