సంచలనం రేపిన 'దిశ'హత్యాచారం కేసులో నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలను చూసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. దిశ తన వాహనాన్ని నిలిపి అక్కడ నుంచి వెళ్లిపోగానే అప్పుడే ఆమెను చెరబట్టాలని పథకం వేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. రాత్రి 9 గంటల తర్వాతే రావడం వల్ల హడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం సేవిస్తూ నిర్ణయించుకున్నారు. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంత దూరం వస్తుందనుకోలేదని నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. నలుగురు నిందితుల్లో ముగ్గురి వయసు 20 ఏళ్లే... నలుగురికీ ఇంతకు ముందు నేర చరిత్ర లేదు.
అప్పటి వరకు ఏం చేశారు?