ఈ నెల 31 వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్భందిగా అమలు చేయాలని.. జారీ చేసిన జీవోలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. లాక్‌డౌన్‌పై వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన సీఎస్..ద్విచక్ర వాహనంపై ఒకరు, ఫోర్ వీలర్స్‌లో ఇద్దరికి మించకుండా అనుమతించాలని సూచించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల లోపు అత్యవసర వైద్య చికిత్స మినహా.. ఏ కారణంతో కూడా రోడ్లపైకి అనుమతించరాదన్నారు.
అధిక ధరలపై..
నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అధిక ధరలపై ఉక్కుపాదం మోపాలని తేల్చిచెప్పారు. చెక్‌పోస్ట్‌ల వద్ద నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. సచివాలయంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు.