తెలంగాణ

telangana

ETV Bharat / city

బిల్డర్లు, గుత్తేదార్లతో త్వరలోనే సమావేశం: సీఎస్ - బిల్డర్ల సమస్యల వార్తలు

సమస్యల పరిష్కారం కోసం బిల్డర్లు, గుత్తేదార్లతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమావేశమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బిల్డర్లు, గుత్తేదార్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా భావిస్తారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

బిల్డర్లు, గుత్తేదార్లతో త్వరలోనే సమావేశం: సీఎస్
బిల్డర్లు, గుత్తేదార్లతో త్వరలోనే సమావేశం: సీఎస్

By

Published : Jan 5, 2021, 4:12 AM IST

సమస్యల పరిష్కారం కోసం బిల్డర్లు, గుత్తేదార్లతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమావేశమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సచివాలయంలో సీఎస్​ను సోమవారం కలిశారు.

ప్రస్తుతం నిర్మాణపనులు, వ్యాపారం పుంజుకొందన్న సభ్యులు..పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. బిల్డర్లు, గుత్తేదార్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో భాగస్వామ్యులుగా భావిస్తారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలోనే సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:'పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details