తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరు నుంచి ఎనిమిది తరగతుల ప్రారంభంపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్ - అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖ అధికారులతో... సీఎస్​ సోమేశ్ కుమార్​ ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నుంచి 6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్నందున... ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

cs somesh kumar teleconference with education and welfare officers
ఆరు నుంచి ఎనిమిది తరగతుల ప్రారంభంపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్

By

Published : Feb 23, 2021, 5:14 PM IST

ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రేపటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

రేపటి నుంచి వీలైనంత వరకు వచ్చే నెల ఒకటో తేదీలోగా తరగతులు ప్రారంభించాలని సీఎస్ సూచించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 17.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశమై తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత

ABOUT THE AUTHOR

...view details