రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహారలోపం, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు స్వయం సహయక సంఘాలు, సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సెర్ప్, పురపాలకశాఖకు చెందిన మెప్మా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీలకు సంబంధించి ఐటీ వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ప్రైజ్, డెవలప్మెంట్, కన్వర్జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
'మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకొచ్చేలా కృషి' - CS Review updates
గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సెర్ప్, పురపాలకశాఖకు చెందిన మెప్మా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకొచ్చేలా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, భూసార పరీక్షలు, కూరగాయల సాగు, పశుసంవర్ధకం, పౌష్టికాహారం తదితర రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎస్ సూచించారు.
'మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకొచ్చేలా కృషి'
స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకొచ్చేలా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, భూసార పరీక్షలు, కూరగాయల సాగు, పశుసంవర్ధకం, పౌష్టికాహారం తదితర రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి వివరాలతో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఐటీ సహాయంతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు నిరంతర సేవలు అందించాలని, ప్రతి గ్రూప్‌నకు బ్యాంక్ లింకేజ్ అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.