తెలంగాణ

telangana

ETV Bharat / city

President Tour: రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్‌కుమార్‌ సమీక్ష - సీఎస్ సోమేశ్‌కుమార్‌

CS on President Tour: ఈనెల 13న హైదరాబాద్​లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు, సంబంధిత శాఖల అధికారులతో CS సోమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని.... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

CS on President Tour
CS on President Tour

By

Published : Feb 11, 2022, 3:09 AM IST

cs somesh kumar review on President Tour: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని.... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని.... CS సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి... ముచ్చింతల్‌లో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు, సంబంధిత శాఖల అధికారులతో CS సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రహదార్లు, బారికేడ్లు, విద్యుత్ సంబంధిత ఏర్పాట్లు చేయాలన్న CS... వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఇదీ చూడండి:CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన

ABOUT THE AUTHOR

...view details