సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్- ఎన్‌ఐటీహెచ్‌ఎంలో టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజుతో కలిసి సీఎస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ జన్మదిన కానుకగా మొక్కలు నాటారు.
'కోటి వృక్షార్చన'లో మొక్కలు నాటిన సీఎస్ - Cs somesh kumar plantation news
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.

కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన సీఎస్ సోమేశ్‌కుమార్