తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐటీ అభివృద్ధికి 27 లోపు సూచనలు సేకరించాలి: సీఎస్​ - it in hyderabad

హైదరాబాద్​తో పాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఐటీ రంగాభివృద్ధి కోసం అవసరమైన బ్లూప్రింట్​ తయారు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్​ కుమార్ ఆదేశించారు. ఐటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వనరుల కల్పనకు, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఈ నెల 27 లోపు సంబంధిత పరిశ్రమ వర్గాల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు.

IT sector in Hyderabad
ఐటీ అభివృద్ధికి 27 లోపు సూచనలు సేకరించాలి: సీఎస్​

By

Published : Jan 25, 2021, 8:48 PM IST

హైదరాబాద్​తో పాటు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఐటీ రంగాభివృద్ధి కోసం అవసరమైన బ్లూప్రింట్​ తయారు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్​ కుమార్ ఆదేశించారు. బీఆర్​కేఆర్ భవన్​లో ఉప్పల్, నాగోల్, కాటేదాన్, కొంపల్లితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఐటీ రంగం అభివృద్ధిపై పలువురు పారిశ్రామిక వేత్తలు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు.

మంత్రి కేటీఆర్ మార్గదర్శకాలతో ఐటీ గ్రిడ్ పాలసీనీ మంత్రివర్గం రూపొందించిందని.. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్​తో పాటు రాజధాని పరిసర ప్రాంతాలలో వివిధ ఐటీ పార్క్​ల ఏర్పాటుకు, ఇప్పటికే నగరంలో ఉన్న ఐటీ పార్క్​లను అవుటర్ రింగ్​రోడ్​కు తరలించడానికి ఈ పాలసీ సహకరిస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వనరుల కల్పనకు, మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఈ నెల 27 లోపు సంబంధిత పరిశ్రమ వర్గాల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని అధికారులను సీఎస్​ ఆదేశించారు.

ఇవీ చూడండి: ఎన్​సీడీసీకి స్థలం కేటాయించాలని కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details