ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Telangana chief secretary) సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. రానున్న ఆరు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్... ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్(vaccination)పై సమీక్షించారు.
రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున.... ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. హమాలీలు, గోనెసంచుల కొరతుంటే స్థానికంగా సమకూర్చుకోవాలని.. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు తూకాల్లో అనవసర తరుగు తీయకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వానాకాలం పంటలకు సరిపడా విత్తనాలు, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.