ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
12:08 October 17
ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లకు దృశ్యమాధ్యమం ద్వారా సీఎస్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 25 విజయదశమి రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా...ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ ఏ మేరకు పూర్తయిందనే అంశాలపై దృష్టిసారించారు. ఎదురవుతున్న ఇబ్బందులు.. అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఆస్తుల నమోదుకు ఇంకా నాలుగు రోజుల గడువే ఉండగా.. భారీ వర్షాల వల్ల కొంతమేరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ 70శాతం వరకు పూర్తవగా.. జీహెచ్ఎంసీ పరిధిలో నెమ్మదించింది. ఇప్పటివరకు 75 లక్షలకుపైగా ఆస్తుల వివరాలను నమోదు చేశారు. రోజుకు 6లక్షలకుపైగా వివరాలు సేకరిస్తున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి తహసీల్దార్లకు 3రోజుల క్రితమే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. వర్షాల వల్ల వాయిదా పడింది. ఈ అంశాలన్నింటిపైనా సీఎస్ సోమేష్‌కుమార్ దృష్టిసారించారు.
ఇవీ చూడండి: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత