ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ నెల 20న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి వివరించేందుకు వీలుగా.. వివిధ రంగాలకు సంబంధించిన నివేదికలు తయారు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. నీతిఆయోగ్ భేటీ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్ - te latest news
ఈనెల 20న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కౌన్సిల్‌కు వివరించేలా.. రాష్ట్రం సాధించిన ప్రగతిపై నివేదిక రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్
రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఆయా శాఖలు నోట్ రూపొందించాలన్న సీఎస్... నీతిఆయోగ్ ర్యాంకులను కూడా పొందుపర్చాలని సూచించారు. కీలకమైన అంశాలు, విధానాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు ప్రతిబింబించేలా నోట్ ఉండాలని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన టీఎస్ ఐపాస్, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి నివేదికలో పేర్కొనాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు వివరించారు.
ఇవీ చూడండి: ఆ రోజుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న: కేటీఆర్