తెలంగాణ

telangana

'రోగ నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి'

కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రక్తపరీక్షల పనితీరు మెరుగుదలపై సమీక్షించారు. కరోనా అనుమానితులు పెరుగుతున్న తరుణంలో రోగ నిర్ధరణ పరీక్షలు మరింత వేగంగా చేయాలని సీఎస్ కోరారు.

By

Published : Apr 5, 2020, 6:53 AM IST

Published : Apr 5, 2020, 6:53 AM IST

cs conference with health department officials
రోగ నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి

కరోనా రోగ నిర్ధరణ పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్యులను కోరారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎస్​, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల పర్యవేక్షకులు, రక్త పరీక్షల విభాగాధిపతులతో మాట్లాడారు.

భద్రత, పారిశుధ్యం, వసతి, రవాణా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు. రక్తపరీక్షల పనితీరు మెరుగుదలపై సమీక్షించారు. కరోనా అనుమానితులు పెరుగుతున్న తరుణంలో రోగ నిర్ధారణ పరీక్షలు మరింత వేగంగా చేయాలని సీఎస్ కోరారు. సీసీఎంబీ డైరెక్టర్, వైద్యులకు సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:ప్రధాని మోదీ చెప్పినట్లు దీపాలు వెలిగిద్దాం: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details