తెలంగాణ

telangana

ETV Bharat / city

పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములవ్వాలి: సీఎస్ - పట్టణ ప్రగతిలో పాల్గొన్న సీఎస్ సోమేశ్ కుమార్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో కలిసి ఇబ్రహీంపట్నం నాలుగు, ఐదు వార్డుల్లో పాదయాత్ర చేశారు.

cs attend to the pattana pragathi program in rangareddy dist
పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్

By

Published : Feb 24, 2020, 5:07 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించారు. నాలుగు, ఐదు వార్డుల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ఆవశ్యకత గురించి సీఎస్​ వివరించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అన్ని వార్డుల్లో ఎప్పటికప్పుడు చెత్తను వేరుచేసి, పరిసరాలను నిత్యం శుభ్రం చేసుకోవాలన్నారు.

మున్సిపాలిటీ చట్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..

నూతన మున్సిపాలిటీ చట్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నిబంధనలకు లోబడి ఉండాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి మొక్కలు నాటి వార్డుల్లో 85 శాతం వరకు హరితహారం పెంచాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్

ఇవీ చూడండి:ఎమ్మెల్సీని అడ్డుకున్న టోల్​ సిబ్బంది... గేట్​ వద్దే బైఠాయించిన నేత

ABOUT THE AUTHOR

...view details