తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirupati SVIMS : స్విమ్స్‌ ఆస్పత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం

Tirupati SVIMS : తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం చేశారు. ఓ వ్యక్తికి పిరుదుల భాగం నుంచి ఎడమ భుజం వరకు శరీరం లోపల చొచ్చుకు వచ్చిన మూడు అడుగుల ఇనుపచువ్వను శస్త్రచికిత్స చేసి తొలగించారు.

Critical Surgery in SVIMS, స్విమ్స్ ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స, critical surgery in SVIMS
స్విమ్స్​లో క్లిష్టమైన శస్త్రచికిత్స

By

Published : Nov 30, 2021, 12:44 PM IST

Tirupati SVIMS : ఓ వ్యక్తి పిరుదుల భాగం నుంచి ఎడమ భుజం వరకు శరీరం లోపల చొచ్చుకు వచ్చిన ఇనుపచువ్వను తొలగించే క్లిష్టమైన శస్త్రచికిత్సను సోమవారం తిరుపతి స్విమ్స్‌ (Tirupati SVIMS Hospital) ఆస్పత్రిలో విజయవంతంగా నిర్వహించారు. వైద్యుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కె.లక్ష్మయ్య ఈ నెల 27న తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడ్డారు. కింద నిర్మాణ దశలోని ఇనుప చువ్వపై పడటంతో.. పిరుదుల నుంచి ఎడమ భుజం వరకు శరీరంలో చొచ్చుకుపోయింది. ఆదివారం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి 10 ఎం.ఎం.సైజు.. మూడు అడుగుల పొడవున్న ఇనుపచువ్వ శరీరంలో చొచ్చుకుపోయినట్లు గుర్తించారు. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో సీటీ సర్జరీ విభాగం వైద్యురాలు డాక్టర్‌ సత్యవతి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్‌ మధుసూదన్‌ అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. లక్ష్మయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details