తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్​.. రూ.5 లక్షలు స్వాధీనం

కేపీహెచ్‌బీకాలనీలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.5 లక్షల నగదు, ఆరు చరవాణులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు నిందితుల ముఠాను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

cricket betting gang arreste
క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్​.

By

Published : Oct 6, 2020, 10:10 AM IST

ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కడియాల శిరీష్ ‌కుమార్‌, బడంగల్‌పేట నివాసి సంద కృష్ణలు ముఠాగా ఏర్పడ్డారు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కు సమీపంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ విషయంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ విషయం మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు తెలిసి దాడులు నిర్వహించగా వారిద్దరూ చిక్కారు. రూ.5 లక్షల నగదు, ఆరు చరవాణులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు నిందితుల ముఠాను మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీ చూడండి:బెట్టింగ్​ జోలికి పోవద్దు... ఆర్థికంగా నష్టపోవద్దు: సీపీ సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details